తెలుగు రాష్ట్రాలు…వాతావరణ సూచన

6
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వెదర్ అప్‌డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తూర్పు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా నమోదవుతాయి అని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా జయశంకర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల 42°C కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని వెల్లడించింది.

దక్షిణ, మధ్య, తూర్పు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని… హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత 39-40°C వద్ద ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు ఆనుకుని ఉన్న ఇంటీరియర్ కోస్తా ఏపీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా ఉండే అవకాశముంది. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గరిష్ఠంగా 42°C వద్ద ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఉత్తర ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.#విశాఖపటణం లో గరిష్ఠ ఉష్ణోగ్రత 35-36°C ఉండవచ్చు, అలాగే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

Also Read:అణు బెదిరింపులను సహించం:మోదీ

- Advertisement -