OTT: ఈ వారం ఓటీటీ సినిమాలివే!

13
- Advertisement -

ప్రతీ వారం లాగే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఓటీటీ సినిమాలను పరిశీలిస్తే..అమెరికన్‌ మ్యాన్‌ హంట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)- మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా అమెజాన్‌ ప్రైమ్ లో వీల్‌ ఆఫ్‌ టైమ్‌ 3 వెబ్‌సిరీస్‌ – మార్చి 13 నుండి, బీ హ్యాపీ (హిందీ) – మార్చి 14 నుండి ఒరు జాతి జాత‌క‌మ్ అనే మ‌ల‌యాళ మూవీ మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది.

జీ5 లో ఇన్‌ గలియోంమే (హిందీ)- మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఆపిల్‌ టీవీ ప్లస్ లో డోప్‌థీప్‌ (వెబ్‌సిరీస్‌) – మార్చి 14 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, ఈటీవీ విన్ లో పరాక్రమం (తెలుగు) – మార్చి 13 నుండి, రామం రాఘవం (తెలుగు) – మార్చి 14 నుండి స్ట్రీమ్ కానుంది.

థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలను చూస్తే.. మార్చి 14న నాని నిర్మాతగా, రామ్‌ జగదీశ్‌ దర్శకత్వంలో రూపొందిన కోర్టు సినిమా రిలీజ్ కానుంది. ఇందులో ప్రియదర్శి, హర్ష్‌ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అలాగే మలయాళ చిత్రం ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్‌ అబ్రహాం కీలక పాత్రలో శివమ్‌ నాయర్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ఫిల్మ్‌ ది డిప్లొమాట్ కూడా మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక కార్తీ హీరోగా రూపొందిన యుగానికి ఒక్క‌డు చిత్రం మార్చి 14న రీరిలీజ్ కానుంది.

Also Read:చేనేత కార్మికులకు శుభవార్త

- Advertisement -