OTT:ఈ వారం సినిమాలివే!

6
- Advertisement -

ప్రతీవారం లాగే ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా థియేటర్లలో సంచలనం సృష్టించింది. నూతన దర్శకుడు సాయిలు కాంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్ ఉద్దేమారి, తేజస్వి రావు హీరోహీరోయిన్లుగా నటించారు. చైతు జొన్నలగడ్డ విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ప్రస్తుతం ETV Winలో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఓటీటీలో మంచి స్పందన వస్తుందని అంచనా. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 19, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

విక్రాంత్, చందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బోల్డ్ సినిమా, పురుషుల వంధ్యత్వం అనే సున్నిత అంశాన్ని వినోదాత్మకంగా చూపిస్తుంది. సంజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు జియో హాట్‌స్టార్లో ఓటీటీ విడుదల పొందనుంది. థియేటర్లలో ఆశించిన విజయం దక్కకపోయినా, ఓటీటీలో అదృష్టం పరీక్షించుకోనుంది.

Also Read:ఛాంపియన్ మూవీ..ఆనందంగా ఉంది!

సునీల్, ఈషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. కబీర్ లాల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ ఫిల్మ్ డిసెంబర్ 19 నుంచి సన్ నెక్స్ట్‌లో డిజిటల్ రిలీజ్ అవుతోంది. అంధ యువతిగా ఈషా చావ్లా ఎదుర్కొనే సవాళ్ల కథగా ఈ సినిమా సాగుతుందని ప్రమో సూచిస్తోంది.

ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్ ఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. మానసిక థ్రిల్లర్‌గా రూపొందిన ఈ 6 ఎపిసోడ్‌ల సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ హీరోయిన్‌గా నటించారు. ప్రత్యేక శక్తులు పొందిన ఓ డాక్టర్ వాటిని దుర్వినియోగం చేసి నిరపరాధులను హత్య చేసే కథాంశంతో ఈ సిరీస్ డిసెంబర్ 19 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -