OTT:ఈ వారం చిత్రాలివే!

7
- Advertisement -

ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ETV విన్‌లోని కథా సుధ లైనప్‌లో తాజా చిత్రం సింధు. భావోద్వేగ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో మధునందన్, లావణ్య రెడ్డి, సీవీఎల్ నరసింహారావు కీలక పాత్రల్లో నటించారు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

రష్మిక మందన్న నటించిన హారర్ కామెడీ థమ్మా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్‌గా అందుబాటులో ఉంది. రేపటి నుంచి హిందీ వెర్షన్ ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ తదితరులు నటించారు.

హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఏక్ దీవానే కి దీవానియత్. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ హిందీ సినిమా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి తెలుగు వెర్షన్ వచ్చే అవకాశం లేదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రచారాలతో బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు పొందిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు కాంపాటి దర్శకత్వంలో అఖిల్ రాజ్ ఉద్దేమారి, తేజస్వీ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 18, 2025 నుంచి ETV విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రియదర్శి, కాయల్ ఆనంది జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ప్రేమంటే థియేటర్లలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీకి వస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 19, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సునీల్, ఈషా చావ్లా, కమల్ కమరాజు ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ వెబ్ మూవీ దివ్య దృష్టి. డిసెంబర్ 19, 2025 నుంచి సన్ నెక్స్ట్‌లో నేరుగా విడుదల కానుంది. కబీర్ లాల్ దర్శకత్వం వహించారు.

2020లో విడుదలైన హిందీ మర్డర్ మిస్టరీ రాత్ అకేలీ హైకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 19, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, చిత్రాంగదా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. హనీ త్రేహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తెలుగు వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.నటుడు వరుణ్ సందేశ్ వెబ్ సిరీస్‌లో అడుగుపెట్టిన తొలి ప్రయత్నం నయనం. సైకాలజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ డిసెంబర్ 19, 2025 నుంచి ZEE5లో ప్రసారం కానుంది. స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి.

మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మిసెస్ దేశ్‌పాండే డిసెంబర్ 19, 2025 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. జాతీయ అవార్డు విజేత నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచ్ సిరీస్ లా మాంతే ఆధారంగా రూపొందింది. తెలుగు వెర్షన్‌పై ఇంకా స్పష్టత లేదు.

Also Read:ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు

మమ్ముట్టి నటించిన మిస్టరీ కామెడీ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఎట్టకేలకు ఓటీటీకి వస్తోంది. 2025 జనవరిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిసెంబర్ 19, 2025 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ మలయాళంలో చేసిన తొలి దర్శకత్వ చిత్రం ఇది. తెలుగు వెర్షన్‌పై సమాచారం లేదు.

ప్రఖ్యాత కామెడీ డ్రామా సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్! నాలుగో సీజన్ డిసెంబర్ 19, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. అనూ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సయాని గుప్తా, బాణీ జే, కిర్తి కుల్హారి, మాన్వి గగ్‌రూ ప్రధాన పాత్రల్లో నటించారు.నివిన్ పాలీ నటించిన తొలి ఓటీటీ మలయాళ వెబ్ సిరీస్ ఫార్మా. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ డిసెంబర్ 19, 2025 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రముఖ హిందీ టాక్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నాలుగో సీజన్ డిసెంబర్ 20, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షోలో బాలీవుడ్‌తో పాటు ఇతర రంగాల ప్రముఖులు అతిథులుగా పాల్గొననున్నారు.

- Advertisement -