2024 సంవత్సరంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల ఆలయానికి గత ఏడాది రూ.1,367 కోట్ల హుండీ ఆదాయం సమకూరగా ఈ ఏడాది రూ.1600 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.
హుండీ ఆదాయం అత్యధికంగా ఆగస్టు నెలలో రూ.125.62 కోట్లు సమకూరగా అత్యల్పంగా ఏప్రిల్ నెలలో రూ.101కోట్లు ఆదాయం మాత్రమే సమకూరింది. డిసెంబర్ నెలలో రూ. 115 కోట్లు హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.
అత్యధికంగా మే నెలలో 23లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. ఫిబ్రవరి నెలలో అత్యల్పంగా 19లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా.. 99లక్షల మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ పేర్కొంది. 6.30కోట్ల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా.. ఈ ఏడాది మొత్తం 12.44కోట్ల లడ్డూలు విక్రయించారని వెల్లడిచింది టీటీడీ.
Also Read:యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’