2024: టాప్-10 ట్రెండింగ్ టాపిక్స్ ఇవే..!

2
- Advertisement -

2024 ముగింపు దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్​ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్ లిస్ట్‌ను విడుదల చేసింది. ప్రధానంగా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని తృటిలో చేజార్చుకుని రాజకీయ రంగంలోకి ప్రవేశించి తొలిసారే సత్తా చాటిన ‘వినేష్ ఫోగట్’ గురించి తెగ వెతికేశారట.

అలాగే హార్దిక్ పాండ్యా, రతన్ టాటా,అజర్‌బైజాన్,ఆరెంజ్ పీల్ థియరీ , థ్రోనింగ్ డేటింగ్ వంటి వాటి గురించి సెర్స్ చేశారు భారతీయులు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో How to vote Lok Sabha అనే అంశంపై ఎక్కువగా సెర్చ్ చేశారు. 2024లో అత్యధికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) కోసం సెర్చ్ చేశారు.

దీంతో పాటు T20 వరల్డ్ కప్ , భారతీయ జనతా పార్టీ , ఎలక్షన్ రిజల్ట్స్ 2024 , రతన్ టాటా , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , ప్రో కబడ్డీ లీగ్ , ఇండియన్ సూపర్ లీగ్ ఈ సంవత్సరం టాప్-10 ట్రెండింగ్​లో ఉన్నాయి.

Also Read:ఈ ఏడాది నెటిజన్లు వెతికిన టాప్ 10 వంటకాలివే!

- Advertisement -