వైసీపీకి 40 సీట్లే.. జగన్ కు షాక్ ?

58
- Advertisement -

ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి మూడు ప్రధాన పార్టీల మద్య రాజకీయ ఎత్తుగడలు నిత్యం చర్చనీయాంశంగానే నిలుస్తుంటాయి. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తుంటే.. జగన్ ను గద్దె దించి తాము అధికారంలోకి రావాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో అధినేతల వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికప్పుడు పోలిటికల్ హీట్ ను పెంచుతూనే ఉంటాయి. ఇదిలా ఉంచితే ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. అంటే ప్రతిపక్షమే లేని విధంగా ప్రభుత్వాన్ని సంస్థాగతం చేసుకోవాలనేది జగన్ ఆలోచన.

ఇప్పటికే వైనాట్ 175 అంటూ తమ టార్గెట్ ను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు జగన్. అయితే ఆయన నిర్దేశించుకున్న టార్గెట్ రిచ్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే.. క్లీన్ స్వీప్ పై జగన్ చూపిస్తున్న కాన్ఫిడెన్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కాగా ఇప్పటివరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీదే విజయం అన్నరీతిలో వస్తే.. మరికొన్నేమో వైసీపీ విజయంపై నో క్లారిటీ అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగైదు స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పుకొచ్చారు.

Also Read:Harishrao:తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే కుట్ర

ఇక అసెంబ్లీ ఎన్నికల విషయంలో ప్రజలు వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నారని సర్వేలు చెబుతున్నట్లు రఘురామ చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఏపీలో కాంగ్రెస్ తరుపున షర్మిల బరిలో నిలిస్తే వైసీపీకి 40 సీట్లు కూడా కష్టమే అని తేల్చి చెప్పారు. ఎందుకంటే చాలా వర్గాల్లో జగన్ పాలనపై అసంతృప్తి ఉందని, ముఖ్యంగా ఈసారి ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని, షర్మిల కాంగ్రెస్ లో చేరితే ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మల్లె అవకాశం ఉందని జోష్యం చెప్పుకొచ్చారు రఘురామ కృష్ణరాజు.. గత కొన్నాళ్లుగా షర్మిల కాంగ్రెస్ లో చేరతారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె కాంగ్రెస్ లో చేరితే ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు హస్తం హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. అదే గనుక జరిగితే వైఎస్ జగన్ కు కోలుకోలేని షాక్ తగిలినట్లేనని చెప్పవచ్చు.

- Advertisement -