- Advertisement -
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మంత్రులతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ప్రధానంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రాభివృద్ధి తీరుతెన్నును ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:దశాబ్ధి ఉత్సవాల కమిటీ ఛైర్మన్గా సీఎస్ శాంతికుమారి
- Advertisement -