ఈ ఏడాది అందరు స్టార్ హీరోలు భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. కెరీర్ పరంగా అలాగే ఫ్యామిలీ పరంగానూ ఇయర్ ని హ్యాపీ గా పాస్ చేసేశారు. కానీ మహేష్ కి మాత్రం ఈ ఏడాది బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. అవును 2022 మహేష్ కి ఓ చెడు సంవత్సరంలా నిలిచిపోయింది. అన్నయ్య రమేష్ బాబు , తల్లి ఇందిరా దేవి , నాన్న మరియు గురువు కృష్ణ ఇలా ముగ్గురు వరుసగా నెలల గ్యాప్ లో మరణించడం మహేష్ కి ఓ తీరని లోటు మిగిల్చింది.
ఇక కృష్ణ గారి మరణం మహేష్ కి పెద్ద లోటనే చెప్పాలి. కెరీర్ పరంగానూ మహేష్ కి ఈ ఏడాది కలిసి రాలేదు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన సర్కారు వారి పాట ఆశించిన ఫలితం అందించలేకపోయింది. మూడు రోజులు బాగానే కలెక్షన్స్ వచ్చినా ఆ తర్వాత పెద్దగా వసూళ్ళు రాబట్టలేదు. అన్ని అంశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ కి సాలిడ్ హిట్ పడలేదు.
ప్రస్తుతం మహేష్ తండ్రి మరణం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్ తో చేయనున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. మరి నెక్స్ట్ ఇయర్ మహేష్ కి బాగా కలిసొస్తే బాగుండని అదిరిపోయే హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి…