2022వ సంవత్సరానికిగాను నోబెల్ శాంతి పురస్కారాన్ని ఓ వ్యక్తితో పాటు మరో రెండు సంస్థలకు కలిపి ఇచ్చారు. నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. బెలారస్‌కు చెందిన మానవ హక్కుల అడ్వకేట్ అలెస్ బియాలియాస్కీతో పాటు ఉక్రెయిన్, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థలు మెమోరియల్, సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
నోబెల్ శాంతి బహుమతి గెలిచినవాళ్లు తమ స్వదేశాల్లో సివిల్ సొసైటీ తరపున పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంతరం ప్రశ్నించారని, పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు కమిటీ వెల్లడించింది. యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపినట్లు తెలిపింది.
శాంతి, ప్రజాస్వామ్యం కోసం శాంతి పురస్కార గ్రహీతలు ఎంతో కృషి చేసినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. అయితే గతేడాది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషి చేసిన జర్నలిస్టులు మరియా రెసా (ఫిలప్పీన్స్), దిమిత్రి మురాతోవ్ (రష్యా)లకు దక్కిన విషయం తెలిసిందే.