2019ల నాటి సమస్యే ఇప్పుడు ఎదురైంది: జహీర్‌ఖాన్‌

36
- Advertisement -

భారత మాజీ ఫేసర్‌ టీమ్‌ఇండియాకు కీలకమైన సూచనలు చేశారు. భారత్ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై టీమ్‌ఇండియా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 2023 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోని ఈ సమస్యను త్వరగా పరిష్కారించాలని సూచించారు. ఇదే సమస్యతో 2019 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో భారత్‌ బ్యాటింగ్ ఆర్డర్‌లో 4వ స్థానంలో ఆడే ఆటగాళ్లు గాయాల గురికావడమే నాటి ప్రపంచకప్‌ టోర్నీ నుంచి భారత్‌ నిష్క్రమించిందని అన్నారు. అయితే అలాంటి లోపాన్ని ఇప్పడు టీమ్‌ఇండియా ఎదుర్కొంటుదని అన్నారు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఆడాల్సిన ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ఈ సమస్య జటిలమవుతుందన్నారు. ఈ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్ నిలకడగా ఆడినా అతడు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరవమవుతున్నారు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్య కుమార్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈమేరకు జహీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాటింగ్ ఆర్డర్‌పై కచ్చితంగా సమీక్షించుకోవాలన్నారు. నాటి సమస్యను ఈ సారి పునారవృత్తం కాకుండా చూడాలన్నారు.

ఇవి కూడా చదవండి…

ipl:అవసరమైన ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకండి.!

Nikhat Zareen:రెండోసారి ఫైనల్లో నిఖత్

రాయ్‌బరేలి హాకీ స్టేడియంకు రాణి పేరు..

- Advertisement -