2019: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్..!

617
balakrishna
- Advertisement -

2019…నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ సంవత్సరం విడుదలైన బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడ్డాయి. దీంతో బాలయ్య బాబు ఫ్యాన్స్‌ నిరాశలో మిగిలిపోయారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్‌తో మెప్పించలేకపోయాడు బాలకృష్ణ. కథానాయకుడు,మహానాయకుడిగా రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

రూ. 10 కోట్లు కూడా రాబట్టలేకపోయిన ఈ మూవీతో నిర్మాతగానూ ఫెయిల్ అయ్యాడు బాలయ్య. ఇక తాజాగా డిసెంబర్ 20న రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన బాలయ్య…మరోసారి నిరుత్సాహ పర్చాడు. కనీసం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సంగతి పక్కనపెడితే ఈ సినిమా గురించి చర్చించిన వారు తక్కువే.

ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో హిందుపూర్‌లో బాలయ్య గెలిచినా టీడీపీ మాత్రం ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో 2019 బాలకృష్ణ సినీ,పొలిటికల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఈయర్‌గా మిగిలిపోయిందనే అంతా భావిస్తున్నారు.

- Advertisement -