ఎన్‌టీవీ చైర్మన్‌కు తానా జీవనసాఫల్యపురస్కారం..

358
NTV Chairman T Narendra Chowdary
- Advertisement -

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతి మహాసభల్లో తానా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఈసారి కూడా పలువురు ప్రముఖులకు ఇస్తున్నారు. ఈ సారి తానా జీవన సాఫల్య పురస్కారం ఎన్‌టీవి చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరికి ఇవ్వనున్నామని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలియజేసారు.

ఎన్టీఆర్‌ కల్చరల్‌ అవార్డ్‌ను ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణకు, తానా గుత్తికొండ రవీంధ్రనాథ్‌ సర్వీస్‌ అవార్డ్‌ను డా. గంగా చౌదరికు, తానా గిడుగు రామ్మూర్మి అవార్డును డా. గారపాటి ఉమమహేశ్వర్‌రావుకు ఇవ్వనున్నామని సతీష్ వేమన తెలిపారు. తానా ప్రెసిడెంట్‌ అవార్డులను భారత్‌ బయోటెక్‌ సిఇఓ కృష్ణ ఎల్లా, గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ రవీంద్రనాథ్‌ కంచర్లకు, కాకినాడ సీపోర్ట్స్ చైర్మన్ కేవీ రావు, మహిళాసాధికారత కోసం విశేష కృషి చేసిన బత్తుల విజయభారతికు ఇవ్వనున్నారు.

తానా ఎక్స్‌లెన్సీ అవార్డ్స్‌ను 12 మందికి ప్రకటించారు. తానా మెరిటోరియస్‌ అవార్డులను కూడా ప్రకటించారు.శశికాంత్ వల్లిపల్లి, జయంత్ రెడ్డి చల్లా, ప్రసాద్ పాండా, మృణాళిని సదానంద, స్వాతి గుండపునీడి, అడపా ప్రసాద్, ప్రసాద్ కునిశెట్టి, రజనీకాంత్ గంగవరపు, నిత్య మలిశెట్టి, వసుంధర కలశపూడి, అనురాధ నెహ్రు, రావు రాపాక, ప్రకాశం తాతా, హనుమయ్య బండ్ల, ధర్మప్రచారక్ రామినేని, స్నేహ తాళిక, లక్ష్మి లింగ, కృష్ణమోహన్ రావు జెజ్జల, ససల చల్ల, కావ్య కొప్పరపు, సందీప్ వోలేటి, నైషా బెల్లం, కుమార్ నందిగం, నాగరాజు నలజుల తదితరులకు జులై నాలుగవ తేదీన జరిగే బాంక్వెట్‌లో అందజేయనున్నట్లు తానా కాన్ఫరెన్స్‌ అవార్డుల కమిటీ సభ్యులు రామ్ బోబ్బా, గోపాల్ శీలమనేని తెలియజేసారు.కాన్ఫరెన్స్ గురించి పూర్తి వివరాలకు www.tana2019.org చూడండి.

- Advertisement -