నోటుకు నీటి ప‌రీక్ష‌….

264
- Advertisement -

రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. పెద్ద నోట్ల మార్చుకునెందుకు ప్రజలు బ్యాంకుల దగ్గర రోజు క్యూ కడుతున్నారు. కొంత మంది పాత నోట్లు చెల్లవని ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నోట్ల రద్దు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిలు కూడా రద్దయ్యాయి. పెద్ద నోట్లు రద్దు కొండనాలుకకు మందు వేస్తే ఉన్నా నాలుక ఉండినట్లు అయిందని కొందరు ప్రజలు తమ గొడు వెలబోసుకుంటున్నారు. ఈ నోట్ల రద్దుతో నిత్యవసర సరుకులు కూడా కొనలేకపోతున్నాం అని ప్రజలు వాపోతున్నారు. ఇలా తమ తమ అభిప్రాయాలను చెప్పుతున్నారు జనాలు,… కానీ మోడీజీ మాత్రం ఒక 50రోజులు ఒపిక పట్టండి మీ సమస్యలు తీరిపోతాయని స్పష్టంచేశారు.

2000 RUPEE NOTES QUALITY

ఈ సంగతి ఇలా ఉంటే కొత్తగా వచ్చిన రూ. 2000 నోటు పైపలు వదంతులు వస్తున్నాయి. రూ.2000నోట్లులో మైక్రో చిప్‌ ఉందని ఈ మైక్రో చిప్‌తో అవినీతిని అరికట్టవచ్చని, ఆదాయానికి మించి డబ్బు ఉంటే ఈ చిప్‌ ఇట్టే కనిపెడుతుందని పుకార్లు జోరుగా వినబడ్డాయి. కాని చివరికి రూ.2000 నోటులో మైక్రో చిప్‌ లేదని తెలిపోయింది.

2000 RUPEE NOTES QUALITY

రూ.2000 నోటుకు పలువురు రకరకల పరీక్షలు పెడుతున్నారు. హై సెక్యూరిటీ ఫ్యూచర్లతో వచ్చిన రెండువేల నోటుకు నీటి పరీక్ష పెట్టి వాటిని వీడియో తీసి యూట్యూబ్, వాట్సప్‌లలో పోస్టు చేస్తున్నారు. రెండువేల నోటును నీటీలో ముంచినా ఏమీ కాదంటూ చూపిస్తున్నారు. పింక్ కలర్ పోతుందేమోనని అనుమానంతో కొందరు నీటి కుళాయి కింద, షవర్ కింద కడుగుతూ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోలు. సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వీడియోని నెటిజన్లు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికి ఈ వీడియోకు 5 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి.

2000 RUPEE NOTES QUALITY

ఇక పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు ఈ నెల 24వరకు వినియోగించవచ్చని కేంద్రం తెలిపింది. ఈ నోట్లు పౌర సేవల బిల్లులు,పెట్రోల్‌ బంకులు, రైల్వే, విమాన టికెట్ల కొనుగోలు, ఇతర పన్నులు, ఫీజులు పాత నోట్లతో చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాత నోట్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. పాత బిల్లుల చెల్లింపునకే ఈ నిబంధనలు వర్తిస్తాయమని ముందస్తు చెల్లింపు చేయకూడదని కేంద్రం సూచించింది.

https://youtu.be/ydLQrIXZFPk

- Advertisement -