దటీజ్‌…భరత్

187
2000 premiere shows for Bharat Ane Nenu
- Advertisement -

మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పూర్తిస్థాయి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నిర్మాతలు రేపు(ఏప్రిల్ 7న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్‌లోనూ పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్‌సిస్‌లో మహేష్‌కు మంచి మార్కెట్ ఉండటంతో దానిని క్యాచ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దాదాపు 2000 ప్రీమియర్‌ షోస్‌ వేయనున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇన్ని ప్రీమియర్‌ షోస్ పడలేదు. దీంతో కేవలం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారానే ఈ సినిమా మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంటుందని భావిస్తున్నారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్‌గా నటించనుంది. మహేష్‌ బాబుకు ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో….ఎన్నికలకు ముందు పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌ తో వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -