పవన్ తొలిప్రేమకు 20 సంవత్సరాలు

235
toliprema
- Advertisement -

ప్రేమకథా చిత్రాల ఫేమ్ కరుణాకరన్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్-కీర్తిరెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం తొలిప్రేమ. 1998 జూలై 24న విడుదలైన ఈ సినిమా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. అప్పుడప్పుడే యవ్వనంలోకి వస్తున్న వారికి మహా కావ్యంగా నిలిచింది.

పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా దాదాపు సంవత్సరం పాటు థియేటర్లలో సందడి చేసింది. కొన్ని థియేటర్లలో డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా దాటింది. పవన్ నటన,పాటలు,డైలాగ్స్‌ ఇప్పటికి యూత్‌ గుర్తుండే ఉంటుంది. ఈ మనసే .. సే నా మనసే …,ఏమి సోదరా.. మనసుకు ఏమయిందిరా ,గగనానికి ఉదయం ఒకటే, కెరటానికి సంద్రం ఒకటే ,ఏమైందో ఏమో అనే పాటలు ఇప్పటికి ఎవర్‌ గ్రీన్‌ హిటే.

సినిమా విడుదలై నేటికి సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి తొలిప్రేమ మూవీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 20yearsofclassictholiprema అనే హ్యాష్‌ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -