సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జయం సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరో నితిన్. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నితిన్ ఇండస్ట్రీలోకి వచ్చి నేటికి 20ఏళ్లు.
2002లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నితిన్ కెరీర్‌కు అదిరిపోయే పునాది వేసింది జయం. ఇక గోపీచంద్ కెరీర్ కూడా మారిపోయింది ఈ చిత్రంతోనే.టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ చిత్రం జయభేరి మోగించింది.
ఎన్. సుధాకర్ రెడ్డి తనయుడైన నితిన్ తొలిసినిమాతోనే ఫిలింఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు . తర్వాత దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి యూత్‌పుల్ చిత్రాలతో మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. సంబరం , శ్రీ ఆంజనేయం, ధైర్యం, అల్లరి, బుల్లోడు, రామ్,విక్టరీ సినిమాలు తీసినా పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. విక్టరీ సినిమాతో సిక్స్ ప్యాక్‌తో కనిపించిన నితిన్ ఫ్యాన్స్‌ను సంపాదించకున్నారు.
వరుస పరాజయాల బాట నుండి త్రివిక్రమ్ అ..ఆ!తో గట్టెక్కిన నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు నితిన్. మరి నితిన్ మాచర్ల నియోజకవర్గంతో హిట్ కొడతాడో లేదో వేచిచూడాలి.