- Advertisement -
ఇరాక్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సైన్యం జరిపిన కాల్పుల్లో 20 మంది మృతిచెందారు. దాదాపు వంద మందికిపై గాయాల పాలయ్యారు.
షియా మతాధికారికి మద్దతుగా నిరసన నేపథ్యంలో ఇరాక్ సైన్యం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఇరాక్‌లో కీలకమైన షియా మతాధికారి ముక్తాదా అల్ సదర్ సోమవారం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
అలాగే తన పార్టీ కార్యాలయాలను సైతం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు.
- Advertisement -