రికార్డు సృష్టించనున్న’2.o’..

231
- Advertisement -

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ దర్శకుడు. రజనీ సరసన అమీజాక్సన్‌ కథానాయిక నటించింది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించగా.. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ మూవీ న‌వంబ‌ర్ 29న విడుద‌లైంది. ఈ విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కొత్త రికార్డులను నెలకొల్పుతూ తన సత్తా చాటుతోంది.

2.O Movi

ఈ సినిమా కర్ణాటకలోను భారీ వసూళ్లతో జోరును కొనసాగిస్తోంది. 15 రోజులలో ఇక్కడి వసూళ్లు 45 కోట్లకి చేరుకున్నాయి. కన్నడ నాట ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఈ వసూళ్లు 50 కోట్లకి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కర్ణాటకలో అత్యధిక వసూళ్లను సాధించిన రజనీ తొలి చిత్రంగా ‘2.ఓ’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుంది. ఇక త్వరలోనే ఈ సినిమాను చైనాలో 56 వేల స్క్రీన్లలో విడుదల చేయనున్నారు. అక్కడ ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో .. ఎన్నేసి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

- Advertisement -