మేకకు దివ్యశక్తులు…క్యూ కట్టిన జనం

202
2-month-old goat is considered a divine miracle
- Advertisement -

అదేదో సినిమాలో అన్నట్టు మన దేశంలో శాస్త్రవ్తేతల కంటే స్వామీజీలు ఫేమస్ అనే డైలాగ్ గుర్తుండే ఉంటుంది. మనం లాజిక్‌ను నమ్మం.. అంతా మ్యాజిక్‌నే నమ్ముతామని. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే మన ముందే ఎందరో స్వామీజీల బాగోతం బుట్టదాఖలైంది. అయిన మళ్లీ మనం స్వామిజీలనే ఆశ్రయిస్తాం..వారి వద్ద ఎవో దివ్యశక్తులున్నాయని నమ్ముతాం..తీరా నిజం తెలిశాక నోరువెల్లబెడతాం. ఇది మనదేశంలో ప్రజల పరిస్థితి.

తాజాగా మధ్యప్రదేశ్‌లో రెండు నెలల వయసున్న మేకకు దివ్యశక్తులు ఉన్నాయంటూ దాన్ని అంతా పూజిస్తున్నారు. అక్కడ ఖర్గోన్ జిల్లాలోని బిరోతి గ్రామంలోని ఈ మేక నెల రోజుల వయసు ఉన్నప్పటి నుంచే పాలివ్వడం మొదలుపెట్టింది. ఆ మేకపిల్ల తన తల్లి వద్ద పాలు తాగడంతో పాటు.. అది కూడా పాలిస్తోంది. లక్షల్లో ఒకదానికి మాత్రమే ఇలాంటి లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నా… దీనికి ఏదో దివ్యశక్తులు ఉండటం వల్లే ఇలా చేస్తోందని భావించి స్థానికులంతా ఆ మేకపిల్లను పూజించడం మొదలుపెట్టారు.

పైగా మేక పిల్ల దివ్యశక్తుల వల్లే పాలిస్తుందని గుడ్డిగా నమ్మడం.. రోజు పూజలు చేయడం చకచక జరిగిపోతున్నాయి. దీంతో ఆ మేక పిల్ల కొన్ని రోజుల వ్యవధిలోనే చూట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫేమస్ అయిపోయింది.తాను పెంచుకుంటున్న మేకపిల్ల ఇంత ఫేమస్ కావడంతో దాని యజమాని సఖీ బాయ్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు.

- Advertisement -