ప్రేమ..స్నేహం నేపథ్యంలో ‘2 ఫ్రెండ్స్’

184
2 Friends movie updates
- Advertisement -

ప్రేమ, స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు, కన్నడ చిత్రం ‘2 ఫ్రెండ్స్’.  శ్రీనివాస్ జి.ఎల్.బి.శ్రీనివాస్ దర్శకత్వంలో ముళ్ళగూరు లక్షీదేవి సమర్పణలో అనంతలక్ష్ళీ క్రియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్ నాయుడునిర్మిస్తున్నారు. సూరజ్ హీరోగా నటిస్తుండగా రవీంద్రతేజ, కార్తీక్, సానియా, సారా, స్నిగ్ద,ధన్ రాజ్, సమీర్ దత్ ముఖ్యపాత్రధారులు. వీరిపై హైదరాబాద్లో సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం వరంగల్ సమీపంలోనిల క్నవరం, కంఠాత్మకూర్ ప్రాంతాల్లో హీరో స్నేహితులపై స్వర్ణమాస్టర్ నేతృత్వంలో పాట చిత్రీకరించారు. “మచ…. మచ్చ” పల్లవితో సాగే చిర్రావూరి విజయ్ కుమార్ రచించిన ఈ పాటను నాలుగు రోజులు చిత్రీకరించారు.

అనంతరం యూనిట్ బెంగళూరు చేరుకుంది. అక్కడ హీరో , హీరోయిన్లతో పాటుగా సాయిప్రకాష్, కవిత పాల్గొని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు దర్శకుడు జి.ఎల్.బి.శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం అనంతపరంలో షూటింగ్ చేస్తున్నారు. స్థానిక అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజ్లో శుక్రవారంనుండి పాట చిత్రీకరిస్తున్నారు. దీనికి స్వర్థమాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. అనంతపురంలో నెలాఖరు వరకు షూటింగ్ చేస్తారు.

2 Friends movie updates
“ప్రేమకంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో  ఈ చిత్రం రూపొందుతోందని” నిర్మాత ముళ్ళగూరు అనంతరాముడు చెప్పారు. మా సంస్థలో ఇది తొలిచిత్రం. కేవలం వినోదమే కాకుండా అంతర్లీనంగా యువతకు సందేశం ఇచ్చేవిధంగా ఉంటుంది. యూనిట్ అంతా సహకారం అందిస్తున్నారు”అని ఆయన తెలిపారు.

“మంచికథని తయారుచేసుకోవడానికి ఏడాదిసమయంపట్టిందని, అభిరుచి ఉన్ననిర్మాతలభించాడని, ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు”దర్శకుడు జి.ఎల్.బి.శ్రీనివాస్ తెలిపారు.

2 Friends movie updates
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టి. సురేందర్ రెడ్డి, కథ,మాటలు,సంగీతం: పొలూర్ ఘటికాచలం, నిర్మాతలు:ముళ్ళగూరు అనంతరాముడు, రమేష్ నాయుడు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.ఎల్.బి.శ్రీనివాస్

- Advertisement -