Telangana Rains:రెండురోజులు వర్షాలు

2
- Advertisement -

తెలంగాణ వర్షాలపై వాతావరణ శాఖ అప్‌డేట్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దానా తుపాను ముప్పు తప్పినప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.

భారీ వర్షాలకు అవకాశం లేకపోయినా.. జల్లులకు మాత్రం ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 102.28 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు చెప్పారు. సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పారు.

రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న వారం రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

Also Read:KTR: పది నెలల్లోనే కరెంట్ ఛార్జీల పెంపా?

- Advertisement -