2.o ఆడియో హంగామా..

259
2.0 Audio Launch in Dubai
- Advertisement -

సూపర్ స్టార్ రజనీతో దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ 2.ఓ. గతేడాదిలో ప్రారంభమైన ఈ చిత్రం సుదీర్ఘ కాలం చిత్రీకరణ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటు శుక్రవారం దుబాయ్‌లో భారీ ఎత్తున ఆడియో లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆడియో వేడుకను శుక్రవారం నిర్వహించడానికి ఓ ప్రత్యేకత ఉందన్న సంగతి తెలిసిందే.

2.0 Audio Launch in Dubai

2.ఓ. సినిమాని లైకాప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరకర్త. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో పాటల విడుదల వేడుక అట్టహాసంగా జరిగింది. భారీ హంగుల మధ్య జరిగిన ఈ వేడుకకి ఎ.ఆర్‌.రెహమాన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా సంగీత ప్రదర్శనతో పాటు, బాస్కో బృందం నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘2.ఓ’ పాటల విడుదల సందర్భంగా దుబాయ్‌ నగరంలో ఎక్కడ చూసినా ఆ సినిమా పోస్టర్లే దర్శనమిచ్చాయి.స్కై డైవ్‌ చేస్తూ పోస్టర్‌ని ప్రదర్శించడం ఆకట్టుకుంది.

2.0 Audio Launch in Dubai

యువ కథానాయకుడు రానా, బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌జోహార్‌, తమిళ నటుడు ఆర్‌.జె.బాలాజీ వేడుకని హోస్ట్‌ చేశారు. రజనీకాంత్‌ కుటుంబసభ్యులతో పాటు సూర్య, జ్యోతిక, కార్తి తదితరులు పాల్గొన్నారు. వేడుక‌లో భాగంగా ర‌జనీకాంత్‌ని ఓ తెలుగు డైలాగ్ చెప్పాల‌ని రానా కోరగా. దానికి ర‌జ‌నీ `భాషా` చిత్రంలోని `నేను ఒక్క‌సారి చెబితే వంద సార్లు చెప్పిన‌ట్లే` అనే డైలాగ్ చెప్పడంతో సభ చప్పట్లతో దద్దరిల్లింది. అక్ష‌య్ కుమార్ త‌న ఎంట్రీని ట్విట్ట‌ర్ ఖాతాలో పంచుకున్నారు.

- Advertisement -