ట్రంప్ దోషి..యుఎస్‌ చరిత్రలో తొలిసారి!

5
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్‌ తగిలింది. 34 నేరాభియోగాల్లో దోషిగా తేలారు. ఓ పోర్న్ స్టార్‌కు డ‌బ్బులు ఇచ్చిన కేసులో మ‌న్‌హ‌ట్ట‌న్ కోర్టు జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అమెరికా చ‌రిత్ర‌లో ఓ మాజీ దేశాధ్య‌క్షుడు.. ఏదైనా నేరంలో దోషిగా తేల‌డం ఇదే మొద‌టిసారి.

పోర్న్ స్టార్‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు బిజినెస్ రికార్డుల‌ను తారుమారు చేసిన‌ట్లు ట్రంప్‌పై నేరాభియోగాలు న‌మోదు అయ్యాయి. ఈ విష‌యాన్ని క‌ప్పిపుచ్చేందుకు ట్రంప్ త‌న వ్యాపార ఖాతాల‌ను మార్చేశారు. సుదీర్ఘ కోర్టు విచార‌ణ అనంతరం ట్రంప్‌ను దోషిగా తేల్చగా జూలై 11న శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నుంది.

ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక్ పార్టీ త‌ర‌పున ట్రంప్ పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఒకవేళ శిక్ష ఖరారైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇక ట్రంప్‌కు ఊరట కలిగించే అంశం ఏంటంటే మ‌ళ్లీ కోర్టులో అప్పీల్ చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

Also Read:బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్

- Advertisement -