ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ..

88
- Advertisement -

ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనగర్జన సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రానున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సహా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హస్తం పార్టీలో చేరనున్నారు. ప్రత్యేక విమానం ద్వారా సాయంత్రం 4.40గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్నారు.

సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9గంటల వరకు ఖమ్మంలో జరిగే సభలో పాల్గొంటారు రాహుల్‌. రాత్రి 11. 20గంటలకు ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్తారు.బహిరంగ సభకు హాజరయ్యేవారి వాహనాలకోసం సుమారు 60ఎకరాల్లో నియోజకవర్గాల వారీగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

Also Read:లవంగంతో ఉపయోగాలు..

ఇల్లందు, పాలేరు, పినపాక, ములుగు, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కు రఘునాథ పాలెం ఎస్ఆర్ గార్డెన్స్ మధ్య రహదారి వెంట ఖాళీ స్థలంను సిద్ధం చేశారు.

బహిరంగ సభకోసం 40 ఎకరాల్లో ఏర్పాట్లు చేయగా సుమారు 50 అడుగుల ఎల్‌ఈడీ తెరను వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదికపై సుమారు 200 మంది ఆసీనులుకానుండగా ఐదు లక్షల మంది బహిరంగసభకు వస్తారని అంచనా వేశారు. ఇక ఇదే సభలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సత్కరిస్తారు.

Also Read:సౌండ్ పార్టీ..టైటిల్ లోగో

- Advertisement -