మొదటి ప్రపంచయుద్దంలో పాలుపంచుకున్న విమానం అది. యూకేకు చెందిన 1930 నాటి విమానాని 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానితో ఎయిర్ షో చేయాలనుకున్నారు. దుమ్ము దులిపి మరీ.. దానితో ఎయిర్ షో స్టార్ట్ చేశారు. అంతా సజావుగా ఉంది.. బాగానే ఎత్తుకు వెళ్తుంది అనుకున్న కొద్ది సేపటికే ఎత్తు తగ్గుతూ రావడం ప్రారంభించింది. ఇది గమనించిన పైలట్.. ఇంజన్ ఫెయిల్ అయినట్టు అనుమానించాడు. ఓ బీచ్‌లో అత్యవసర ల్యాడింగ్ చేశాడు.
డెవన్‌లోని సిద్‌మౌత్‌లో ఉన్న జాకబ్ లాడర్ బీచ్‌లో విమానాన్ని ఎటువంటి ప్రమాదం లేకుండా ల్యాండ్ చేసి హీరో అయ్యాడు పైలెట్. ఆ విమానంలో ఉన్న పైలట్‌తో పాటు మరో వ్యక్తి కూడా సేవ్ బయటికి వచ్చారు. ఆ బీచ్‌లో చాలా మంది పర్యాటకులు ఉండడం గమనించిన.. పైలట్ వాళ్లని తప్పుకోవాలని సైగలు చేసి ఎవరికీ ప్రమాదం తలెత్తకుండా విమానాన్ని ల్యాండ్ చేశాడు. అక్కడే బీచ్‌లో ఉన్న వ్యక్తి ఈ సంఘనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.