19243 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్

477
- Advertisement -

బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే యువత కలలను సాకారం చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రకటన వెలువడింది.19 బ్యాంకుల్లో 19,243 క్లర్క్ క్యాడర్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ తాజాగా కామన్ రిటన్ ఎగ్జామినేషన్(సీడబ్ల్యూఈ) VIనిర్వహణకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు..

ఐబీపీఎస్ సీడబ్ల్యూఈ-VIఆధారంగా అభ్యర్థులను నియమించుకోనున్న బ్యాంకులు… అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ ,బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ,పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యుకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్.
ఖాళీలు:
ఆంధ్రప్రదేశ్: 699
తెలంగాణ : 546
విద్యార్హత: డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్స్‌లో తప్పనిసరిగా సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ కోర్సు చేసుండాలి. లేదా హైస్కూల్/కళాశాల/యూనివర్సిటీ స్థాయిలో కంప్యూటర్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నా సరిపోతుంది.
వయసు: 2016, ఆగస్టు 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష (సీడబ్ల్యూఈ)-VIలో రెండు దశలు ఉంటాయి. ఒకటి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. రెండు.. మెయిన్ ఎగ్జామినేషన్.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (గంట వ్యవధి): పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ఈ మూడు విభాగాల్లో విడివిడిగా కనీస మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మెయిన్ ఎగ్జామినేషన్‌కు అనుమతిస్తారు.

ప్రధాన పరీక్ష (మెయిన్ ఎగ్జామినేషన్): 135 నిమిషాల (2 గంటల 15 నిమిషాల) వ్యవధి ఉండే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు విభాగాల వారీగా నిర్దేశిత సమయంలో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలోనూ, మొత్తంమీద కనీస మార్కులు సాధించాలి.

దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ చార్జీల కింద రూ.100; ఇతర అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2016, ఆగస్టు 22
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 12
ఫీజును ఆన్‌లైన్లో చెల్లించేందుకు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 12
ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 2016, నవంబర్ 18
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీలు: 2016, నవంబర్ 26, 27; డిసెంబర్ 3, 4
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల వెల్లడి: 2016, డిసెంబర్
మెయిన్ ఎగ్జామినేషన్‌కు హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 2016, డిసెంబర్
మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలు: 2016, డిసెంబర్ 31; 2017, జనవరి 1
ప్రోవిజనల్ అలాట్‌మెంట్: 2017 ఏప్రిల్
పూర్తి వివరాలు www.ibps.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.*

- Advertisement -