- Advertisement -
జూన్ 6వ తేది నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తాజాగా 17వ లోక్ సభ షెడ్యూల్ ను విడుదల చేశారు పార్లమెంట్ అధికారులు. వచ్చె నెల 6 నుంచి 15వ తేది వరకూ ఈసమావేశాలు జరుగనున్నాయి. మొదట ఎంపీలందరూ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పూర్తి స్ధాయి బడ్జెట్ కు ఆమోదం తెలపుతారు. అలాగే స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ ను కూడా ఎన్నుకుంటారు.
అలాగే గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం తర్వాత ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇక పార్లమెంట్ లో ప్రొటెం స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎంపీ సంతోశ్ గాంగ్వర్ ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణం చేయించనున్నారు.
- Advertisement -