17 ఏళ్ల సింహాద్రి..!

617
jr ntr
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పదిహేడేళ్ల క్రితం విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. 2003లో విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా భూమిక ప్రధాన పాత్రలో నటించారు.

గోదావరి పుష్కరాల ప్రారంభానికి కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో రాజమౌళి- ఎన్టీఆర్ కెరీర్‌ మారిపోయింది. దాదాపు 247 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం 167 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

150 సెంటర్లలో 100 రోజులు ఆడగా సింగమళైగా ఎన్టీఆర్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఇక సింహాద్రి 17 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

- Advertisement -