శివసేనకు షాక్..17 మంది ఎమ్మెల్యేలు జంప్..!

611
shivsena
- Advertisement -

మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకు మలుపుతిరుగుతున్నాయి. రాష్ట్రపతి పాలన తర్వాత కాంగ్రెస్,ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేస్తున్న శివసేనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్,ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడాన్ని తప్పుబడుతూ 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న శివసేనకు గట్టి షాక్ తగిలింది. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగిచ్చేందుకు వారితో సమావేశం కానున్నారు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే.

అటు బీజేపీ సైతం శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లతో పాటు తమతో కలిసివచ్చే ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ముందున్న అవకాశాలపై ఆరా తీస్తోంది.

ఇక ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోగా రైతుల సమస్యలపైనే తాను ప్రధానిని కలిశానని పవార్‌ వెల్లడించారు. మరోవైపు బీజేపీ సైతం శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లతో పాటుఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Shiv Sena, is a Marathi regional and Hindu nationalist political organisation in India founded on 19 June 1966 by political cartoonist Bal Thackeray. 

- Advertisement -