మూడోవారంలో సక్సెస్‌ఫుల్‌గా `16`

213
16 Successfully In 3rd Week
- Advertisement -

నేటి రోజుల్లో సినిమా వారం ఆడితే గొప్ప‌. రెండో వారంలో ప్ర‌వేశిస్తే బ్లాక్‌బ‌స్ట‌ర్‌. మూడోవారంలోకి వెళితే సిల్వ‌ర్‌జూబ్లీ కిందే లెక్క‌. కంటెంట్ లేక‌పోతే అంత సీనే ఉండ‌దు. పెద్ద హీరో, చిన్న హీరో, స్ట్రెయిట్ సినిమా, డ‌బ్బింగ్ సినిమా అన్న తేడా జ‌నాలు చూడ‌డం లేదు. ఇలాంటి ఛేంజోవ‌ర్ టైమ్‌లో వ‌చ్చి సెన్సేష‌న్ సృష్టిస్తోంది `16- ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్‌`.

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన స‌క్సెస్‌ఫుల్  సినిమా ఇది. త‌మిళ వెర్ష‌న్‌ని మించి తెలుగులో పెద్ద స‌క్సెసైందీ చిత్రం. మూడోవారంలోనూ మెజారిటీ థియేట‌ర్ల‌లో పెద్ద సినిమాల‌తో పోటీప‌డి వ‌సూళ్లు సాధిస్తుండ‌డం సెన్సేష‌న్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత చ‌ద‌వ‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ -“16 మూవీ రిలీజ్ రోజు నుంచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని మంచి టాక్‌తో న‌డుస్తోంది. త‌మిళ వెర్ష‌న్‌ని మించి అసాధార‌ణ విజ‌యం సాధించిందని తెలిపారు.

ఇప్ప‌టికి మూడోవారంలో అడుగుపెట్టి చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. ఇటీవ‌ల రిలీజైన పెద్ద సినిమాల‌తోనూ పోటీప‌డి రేసులో దూసుకెళుతోంది. ఎక్కువ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతుండడం సంతోషాన్నిస్తోంది. డెబ్యూ హీరో కార్తీక్ న‌రేన్‌, రెహ్మాన్ ప్రాధాన‌పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగులో క్రిటిక్స్ ప్ర‌శంస‌లు పొందిన అరుదైన చిత్ర‌మిది. ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన థ్రిల్నిచ్చింది కాబ‌ట్టే ఇంత పెద్ద స‌క్సెస్ సాధ్య‌మైంది“ అన్నారు.

- Advertisement -