15వేలు దాటిన మృతుల సంఖ్య

30
- Advertisement -

టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. రెండు దేశాల్లోనూ 15వేల మృతదేహాలను అధికారులు గుర్తించారు. గాయపడిన వారి సంఖ్య సుమారు 60వేల వరకు ఉంటుందని అంచనా.

టర్కీ, సిరియా దేశాల్లోని అనేక ప్రాంతాల్లో సోమవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 7.8 గా భూకంపం తీవ్రత నమోదైంది. ఈ భూకంపం దాటికి ఇరు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.

రెండు దేశాల్లో భూకంపం దాటికి కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగించే ప్రక్రియను రెస్క్యూ సిబ్బంది నిరంతరం కొనసాస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -