అమరావతిలో గూగుల్‌కు 143 ఎకరాలు

8
- Advertisement -

ఏపీలోని అమరావతిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ ఏర్పాటుకానున్న సంగతి తెలిసిందే. అమరావతిలో 143 ఎకరాల్లో సంస్థను ఏర్పాటు చేయనుంది గూగుల్. ఇప్పటికే స్థలం పరిశీలించారు గూగుల్ ప్రతినిధులు.

అనంతవరం, నెక్కల్లు మధ్య గూగుల్ సంస్థకు 143 ఎకరాలు కేటాయించేందుకు మందుకొచ్చింది సీఆర్డీఏ. గూగుల్ కి కేటాయించిన స్థలానికి దగ్గరలోనే నూతన విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గుచూపినట్లు సమాచారం.

గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా మరెన్నో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు వస్తాయని తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాజధాని ప్రాంత ప్రజలు.

Also Read:కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు 

- Advertisement -