- Advertisement -
నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది . ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసానికి ఖైదీ నంబర్ 2261 కేటాయించింది.
పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోరగా దీనిని న్యాయవాది తిరస్కరించారు. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు.
జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల 24న ఫిర్యాదు చేయగా 196,353(2).111 రెడ్ విత్ 3() సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read:ఏఐ .. అదుపు తప్పిన రోబో!
- Advertisement -

