పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్

59
- Advertisement -

బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఫైనల్ అయిపోయాక ఆదివారం రాత్రి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన విధ్వంసం నేపథ్యంలో ప్రశాంత్‌తో పాటు అతడి సోదరుడు మహావీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా ఈ ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.

దీంతో ప్రశాంత్‌తో పాటు మహావీర్‌ని చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. టైటిల్‌ విజేతగా నిలిచిన ప్రశాంత్‌ స్టూడియోస్‌ నుంచి బయటికి రాగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ సైతం బయటకు రాగా అతడి కారు అద్దాలను పగులగొట్టారు.

రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్‌ బస్సు అద్దాన్ని పగులగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read:ఎక్కడికి పారిపోలేదు:పల్లవి ప్రశాంత్

- Advertisement -