జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్

2
- Advertisement -

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. గోవా నుండి జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.

అయితే తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు.. నన్ను కావాలనే ఇరికించారు అని తెలిపారు జానీ మాస్టర్. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని…కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్ గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Also Read:Bigg Boss 8 Telugu:గొడవలు, బూతులు ఇంటి సభ్యుల రచ్చ

- Advertisement -