డ్రగ్స్ కేసులో అరెస్టయిన తమిళ సినీ నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల కస్టడీ విధించింది న్యాయస్థానం. దాదాపు 8 గంటల విచారణ అనంతరం చైన్నై కోర్టు జూలై 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. విచారణలో శ్రీరామ్ కు మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు గుర్తించి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
ఓ బార్‌లో చోటుచేసుకున్న ఘర్షణ సందర్భంగా అన్నాడీఎంకే నాయకులు ప్రసాద్, అజయ్ వాండైయార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో డ్రగ్స్ దందా వెలుగుచూసింది. ప్రదీప్ ద్వారా నటుడు శ్రీరామ్ కు మత్తుపదార్థాలు సరఫరా చేసినట్లు తెలిపారు.
ప్రసాద్ నుంచి శ్రీరామ్ కొకైన్ కొనుగోలు చేశారని, దానికి సంబంధించి నగదును ఆన్‌లైన్‌లో చెల్లించారని దర్యాప్తులో వెల్లడైంది. సోమవారం శ్రీరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించగా.. మత్తు పదార్థాలు ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది.
Also Read:చిరు అమ్మకి అనారోగ్యం..వదంతులే!

