భూకంపంతో నేపాల్ విలవిల..

44
- Advertisement -

భూకంపంతో నేపాల్ విలవిలలాడిపోయింది. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంతో 128 మందికి పైగా మృతిచెందగా 140 మందికి పైగా గాయపడ్డారు. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుమ్ జిల్లాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.

క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు, సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు దేశంలోని మూడు భద్రతా ఏజెన్సీలను సమీకరించినట్లు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ కార్యాలయం తెలిపింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నేపాల్ తోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను భూ ప్రకంపనలు వణికించాయి.

Also Read:బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ఎన్నారైల ప్రచారం..

- Advertisement -