తెలంగాణకు 13 అవార్డులు..

68
- Advertisement -

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ విభాగంలో దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ చేతుల మీదుగా పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ ఎం హన్మంతరావు అవార్డును అందుకున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వివిధ కేటగిరిల్లో తెలంగాణ 13 అవార్డులను సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ ఓవరాల్‌గా మొదటి స్థానంలో నిలిచింది. ఎస్‌ఎస్‌జీ సౌత్ జోన్ ర్యాంకింగ్స్‌లో నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (SSG) ర్యాంకింగ్స్‌తో పాటు, వాల్‌ పెయింటింగ్‌ కాంపిటీషన్‌ ఓడీఎఫ్‌ ప్లస్‌ బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాల నిర్వహణ, గోబర్‌ ధాన్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, బహిరంగ మలవిసర్జన (ఓడీఎఫ్‌) నిర్వహణ వంటి కేటగిరిల్లో అవార్డులు వరించాయి.

- Advertisement -