నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం రావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ ఆమె తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యం వల్లే చెరకు రైతులకు కష్టాలు మిగిలాయని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని భ్రష్టు పట్టించింది చంద్రబాబేనని ఎంపీ కవిత అన్నారు.
రైతులు కొ ఆపరేటివ్ పద్దతిలో ముందుకొస్తే నడిపేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. తప్పకుండా ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తుందని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఎంపీ కవిత హామీ ఇచ్చారు. చెరుకు ఉత్పత్తి ఉన్నా నష్టాల్లో చూపారని విమర్శించారు. చెరుకు రైతులకు టీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
2014 నుంచి రూ66 కోట్లు బకాయిలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. గత మార్చిలో చెరుకు రైతు సమస్యలపై బస్సు యాత్ర చేశామన్నారు. ప్రతిపక్షాలు రైతులను, ఉద్యోగులను మభ్యపెట్టాడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చెరుకు రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎంపీ కవిత పేర్కొన్నారు.