రివ్యూ: 118

404
118 movie review
- Advertisement -

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 118. కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, శాలిని పాండే హీరోయిన్లుగా నటించగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది….ఈ సినిమాతో కళ్యాణ్‌ రామ్ ఎలా ఆకట్టుకున్నారు..?సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా చూద్దాం.. .

కథ:

గౌతమ్‌ (కల్యాణ్‌రామ్‌) ఓ జర్నలిస్ట్‌. తన కలలో ఓ అమ్మాయి (నివేదా థామస్‌) కనిపిస్తుంటుంది.అయితే కలలో జరిగే ప్రతీ సన్నివేశం నిజజీవితంలోనూ తారసపడుతుంది. అంటే ఆ అమ్మాయి కూడా ఉండే ఉంటుందని కళ్యాణ్ రామ్ గట్టికనమ్మకం.మరి ఆ నమ్మకం నిజమైందా..? కలలో కనిపించిన అమ్మాయి నిజంగానే ఉందా..?అసలు 118కి స్టోరీకి లీంకేంటీ అన్నది తెరమీద చూడాల్సిందే.

Image result for 118 movie review

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఫస్టఫ్‌‌, కథనం, కెమెరా. కల్యాణ్‌రామ్‌ లుక్ బాగుంది. ఎవరు చేయని పాత్రలో అద్భుతంగా నటించాడు. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. నివేదా ఉండేది కాసేపే కానీ సినిమా మొత్తం ఆమెచుట్టే తిరుగుతుంది. గౌతమ్ ప్రియురాలి పాత్రలో షాలినీ పాండే జీవించింది. మిగితాపాత్రల్లో రాజీవ్‌ కనకాల, ఛమక్‌ చంద్ర, నాజర్‌ చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ లాజిక్‌ లేకపోవడం,సెకండాఫ్. సెకండాఫ్‌లో ఈ అన్వేషణ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. చుట్టూ తిరిగి మళ్లీ ఉన్న చోటికే వచ్చినట్టు.. క్లూ కోసం మళ్లీ కథానాయకుడు తనకొచ్చిన కలపైనే ఆధారపడతాడు. కలకు సంబంధించిన సన్నివేశాలన్నీ లాజిక్‌కు దూరంగా సాగుతాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. గుహన్‌ రాసుకున్న కథ, స్క్రీన్‌ ప్లే సినిమాకు మరో బలం. పట్టు సడలని కథనంతో ఆసక్తి రేకెత్తించాడు. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. మాటలు పర్వాలేదు.ఎడిటింగ్,కెమెరా బాగుంది.కెమెరామెన్‌గా తానేంటో నిరూపించుకున్న గుహన్ దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లింది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for 118 movie review

తీర్పు:

కొత్త తరహా కథలు,దర్శకులను ఎంకరేజ్ చేయడంలో ముందుండే హీరో కల్యాణ్‌ రామ్‌. అప్పుడప్పుడూ కమర్షియల్‌ కథలు చేస్తున్నా అతనొక్కడే , హరేరామ్‌ లాంటి విభిన్న చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. తాజాగా గుహన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 118గా ప్రేక్షకుల ముందుకువచ్చాడు.కెమెరా,కథనం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా సెకండాఫ్ సాగదీత మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా విభిన్న కథా చిత్రాలను కోరుకునే వారికి నచ్చే సినిమా 118.

విడుదల తేదీ:01/03/2019
రేటింగ్:2.75/5
నటీనటులు: కల్యాణ్‌రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే
సంగీతం: శేఖర్‌ చంద్ర
నిర్మాత: మహేష్‌ ఎస్‌ కోనేరు
దర్శకత్వం: కె.వి.గుహన్‌

- Advertisement -