- Advertisement -
మనీలాండరింగ్ కేసులో తుర్కియే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు అన్నదమ్ముళ్లకు ఒక్కొక్కరిగి ఏకంగా 11,196 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. థోడెక్స్ అనే పేరుతో క్రిప్టో బిబిజెస్ ను స్థాపించిన ఫరూఖ్ ఫతిహ్ ఓజర్(29) మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆయన మోసాలకు పాల్పడ్డారని, క్రిమినల్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. 30 మిలియన్ డాలర్లను రహస్య ఖాతాలకు తరలించారని ఆరోపించింది.
ఈ కేసులో క్రిప్టో బిజినెస్ వ్యవస్థాపకుడికి 40,562 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్ధానం ఓజర్ తోపాటు ఆయన సోదరులు సెరప్, గవెన్ దోషులుగా నిర్ధారించింది. దీంతో ఒక్కొక్కరికి 11,196 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
Also Read:చాకలి ఐలమ్మ..బహుజన చైతన్యానికి ప్రతీక
- Advertisement -