- Advertisement -
ఛత్తీస్ గడ్ లో మావోలు రెచ్చిపోయారు. సుకుమా జిల్లాలో జవాన్లపై ఒక్కసారిగా విరుచుకపడ్డారు. మావోల దాడిలో 26 మంది జవాన్లు మృతిచెందినట్లు సమాచారం. నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మావోల దాడి వార్తను బస్తర్ డీఐజీ సుందర్ రాజు దృవీకరించారు. మరోవైపు బుర్కాపాల్-చింతాగుఫా ప్రాంతంలో ఏడుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.
ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. అది మావోయిస్టులకు పెద్ద దెబ్బగా అప్పట్లో భావించారు. నిజానికి అప్పటినుంచి ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురుచూస్తున్న మావోయిస్టులు.. తాజాగా సుకుమా జిల్లాలో విరుచుకుపడ్డారు.
- Advertisement -