బోయిగూడ ప్రమాదమృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా..

49
boiguda
- Advertisement -

సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన ప్రమాదంలో 11 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

ప్రమాదంలో చనిపోయిన వారి పార్థివ దేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని తెలిపారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నామని చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు.

- Advertisement -