టెన్త్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు..

245
10th class supplementary
- Advertisement -

తెలంగాణలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. మొత్తం 92.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే ఫలితాల్లో విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి తప్పులు దొర్లే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ…జూన్ 10వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు కట్టేందుకు తుది గడువుగా నిర్ణయించారు. పదో తరగతి ఫలితాల్లో వరుసగా మూడోసారి 99.73 శాతంతో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు.

అయితే రిజల్ట్‌ విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే.. ఆ సమస్య, సందేహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ నివృత్తి చేస్తారని వెల్లడించారు. ఫలితాల్లో ఏవైనా తప్పులుంటే TS SSC BOARD యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -