ఏపీలో కొత్తగా 10,759 పాజిటివ్ కేసులు..

34
corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 10,759 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 31 మంది కరోనా వల్ల మృతి చెందారు. 3,992 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,97,462 మంది కరోనా బారిన పడగా.. 9,22,977 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 66,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7,541 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.