మమతా బెనర్జీకి షాక్..బీజేపీలోకి 107మంది ఎమ్మెల్యేలు?

368
West Bengal Mamantha Benjarhji
- Advertisement -

దేశ వ్యాప్తంగా బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటివలే కర్ణాటక, గోవాలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. గోవాలో ఓ కొలిక్కి వచ్చినా, కర్ణాటకలో మాత్రం రోజుకో సీన్ నడుస్తుంది. ఆపరేషన్ సౌత్ పేరుతో సౌత్ రాష్ట్రాలపై పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. కర్ణాటక, గోవా తర్వాత పశ్చిమ బెంగాల్ పై కన్నెసింది బీజేపీ అధిస్టానం. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపుతున్నాయి.

త్వరలోనే రాష్ట్రానికి చెందిన 107మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని చెప్పారు ముకుల్ రాయ్. ముకుల్ రాయ్ 2017లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. పార్టీ మారే వారిలో అధికార టీఎంసీ ఎమ్మెల్యేలతో పాటు.. కాంగ్రెస్, సీపీఎం శాసనసభ్యులు ఉన్నారని వివరించారు. పార్టీలో చేరే వారి జాబితాను తయారు చేశామని, వాళ్లంతా తమతో టచ్‌లోనే ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 మంది శాసన సభ్యులు ఉన్నారు. కాగా 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు అత్యధికంగా 211సీట్లు రాగా, కాంగ్రెస్ కు 44, బీజేపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 42 సీట్లలో బీజేపీకి 18సీట్లలో విజయం సాధించింది.

- Advertisement -