10 వేల అడుగులు..అధిక కొలెస్ట్రాల్‌కు చెక్!

7
- Advertisement -

అధిక కొలెస్ట్రాల్..ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. మారుతున్న జీవన శైలీ కారణంగా వయసుతో సంబంధం లేకుండా చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా మహిళల్లో అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా జబ్బుల బారినపడే వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే ఆహార నియమాల్లో మార్పులు వ్యాయామం చేయడం వల్ల అధిక(చెడు) కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు.

రోజూ తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకపూట భోజనంలో రైస్‌ తీసుకున్నా రాత్రికి మల్టీగ్రెయిన్‌ రోటీ, జొన్నరొట్టె వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మీ బరువుని బట్టి మీ శరీరానికి ఎన్ని కెలోరీలు అవసరమో అందుకు అనుగుణంగా డైట్ ఫాలో కావాలి.

అలాగే ప్రతీరోజూ 150 గ్రా. పండ్లు తినడం చాలా మంచిది. బీన్స్, క్యారెట్, బెండకాయ, ఆకుకూరల ద్వారా పీచుపదార్థం అధికంగా లభిస్తుంది. మాంసాహారులైతే 150గ్రా. చేపలు, 100గ్రా. చొప్పున చికెన్, రెడ్‌మీట్‌ను తక్కువ నూనెతో వండి, గ్రేవీ లేకుండా తినేలా చూసుకోవాలి. ఎంతసేపు వ్యాయామం చేశామనే దానికన్నా ఎన్ని క్యాలరీలు ఖర్చుచేశామన్నది చాలా ముఖ్యం. కనీసం రోజుకు పదివేల అడుగులైనా నడవాలి. ఇలా క్రమం తప్పకుండడా ఆహార, వ్యాయామ నియమాలను పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం.

Also Read:KTR: కరెంటు చార్జీల వంతు వచ్చేసింది

- Advertisement -