సమసమాజం,అసమానత లేని సమాజం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో వరంగల్‌కు చెందిన సీపీఎం నేతలు, కార్యకర్తలు 10 వేలమంది టీఆర్ఎస్‌లో చేరారు. వారందరికి కేటీఆర్ సాదరంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. కమ్యూనిస్టు పార్టీల ఎజెండా అమలు చేస్తూ కేసీఆర్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అసలు సిసలైన కమ్యూనిస్టని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
టీఆర్ఎస్‌ది సంక్షేమ రాజ్యమని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్ రూం,మంచినీటిని అందించే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని వెల్లడించారు. కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ పథకాలతో ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అభినందిచారని గుర్తుచేశారు. పక్కరాష్ట్రం ముఖ్యమంత్రికి ఉన్న సోయి తెలంగాణ సీపీఎం నేతలకు లేదని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంలో అడ్డుపడ్డారని…నేడు బంగారు తెలంగాణకు అడ్డుతగులుతున్నారని తెలిపారు. ఇళ్లు లేని పేదలందరికి పట్టాలు వచ్చేలా చూస్తామని తెలిపారు.
పేదవారి కళ్లల్లో ఆనందం చూసే వరకు విశ్రమించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి తీరుతామని తెలిపారు. రానున్న రెండేళ్ల కాలంలో రెండున్నర లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి తీరుతామని తెలిపారు.
సీపీఎం పార్టీ సిద్దాంతాలకు కాలం చెల్లిందని ఈ సందర్భంగా మాట్లాడిన మెట్టు శ్రీనివాస్ అన్నారు. పేరుకు మాత్రమే కమ్యూనిజమని అమలు చేసేది మాత్రం బాసిజమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలో బాగస్వాముల మవుతామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలతో కేసీఆర్ దేశంలోనే ఆదర్శ సీఎంగా నిలిచారని తెలిపారు. సీపీఎం పార్టీ తమ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని ధ్వజమెత్తారు. పేరుకు కమ్యూనిజం అమలు చేసేది బాసిజం అని చెప్పారు. 2019 తర్వాత సీపీఎం పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. పది వేలమంది సీపీఎం కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని సగర్వంగా ప్రకటించుకుంటున్నానని చెప్పారు.