‘సూపర్ హిట్ మూవీ మేకర్స్’ సంస్థలో షారుఖ్ నిర్మించిన మాస్ అండ్ యాక్షన్ డ్రామా ‘1000 వాలా’. అమిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈరోజు అనగా మార్చి 14 న హోలీ కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
కథ : అర్జున్(అమిత్ డ్రీం స్టార్) ఓ రంగస్థల నటుడు. కానీ తనకి అవకాశాలు రావు. దీంతో అతను ఒక రకమైన డిజప్పాయింట్మెంట్లో ఉంటాడు. ఇలాంటి అతని స్నేహితుడు తండ్రి(పిల్ల ప్రసాద్) ద్వారా ఒక సినిమాలో నటించే ఛాన్స్ వస్తుంది. దీంతో అతను హైదరాబాద్ కి వెళ్తాడు. అక్కడ అర్జున్ ను ఒక ఫ్యామిలీ చేరదీస్తుంది. అలాగే అతను నటించాల్సిన సినిమా షూటింగ్ కూడా సగం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అందులో కూడా అర్జున్ నటించినట్టు ఉంటుంది. దీంతో అర్జున్ షాక్ అవుతాడు. తాను లేకుండా సగం షూటింగ్ ఎలా కంప్లీట్ అయ్యింది. అసలు తనని చేరదీస్తున్న భవాని ప్రసాద్(ముక్తార్ ఖాన్) అండ్ ఫ్యామిలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి.? భవాని ప్రసాద్ స్నేహితుడు(సుమన్) అర్జున్ నే హీరోగా పెట్టి ఎందుకు సినిమా చేస్తున్నాడు.? హీరోయిన్ అర్జున్ ను ఎందుకు ప్రేమిస్తుంది? మధ్యలో డేవిడ్(షారుఖ్ భైగ్) అర్జున్ ను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు ‘1000 వాలా’ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ : మాస్ సినిమాలు ఎన్ని వచ్చినా అన్నీ కరెక్ట్ మీటర్లో సెట్ అయితే ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. ముఖ్యంగా ఇలాంటి కథ కథనాలతో రూపొందిన సినిమాలను బి,సి సెంటర్ ఆడియన్స్ ఆదరిస్తారు. ‘1000 వాలా’ కూడా అలాంటి కమర్షియల్ ప్యాకేజీ కలిగిన సినిమానే. టైటిల్ లో ఎంత మాస్ ఉందో సినిమాలో కూడా అంతే మాస్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్.. అక్కడ హీరోయిజాన్ని దర్శకుడు అఫ్జల్ షేక్ ఎలివేట్ చేసిన తీరు అందరికీ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. అలాగే హీరో- విలన్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు.అవి కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చుతాయి. అంతేకాదు ఇందులో ఎంత మాస్ డోస్ ఉన్నా.. ఫ్యామిలీ టచ్ కూడా మిస్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే తాత మనవళ్ల సీక్వెన్స్ కావచ్చు…సెకండాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్స్, మదర్ సెంటిమెంట్ వంటివి కావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే విధంగా ఉన్నాయి. సంభాషణలు కూడా బాగా పేలాయి. వంశీ కాంత్ రేఖాన సంగీతంలో రూపొందిన పాటలు,ముఖ్యంగా చివరి పాట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తాయి. చందు ఏజే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే… అమిత్ డ్రీమ్ స్టార్ .. అటు అర్జున్ గా ఇటు అమిత్ గా 2 రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో ఒదిగిపోయాడు. షారుఖ్ భైగ్ .. రూపంలో ఓ స్టైలిష్ విలన్ టాలీవుడ్ కి దొరికాడు అని చెప్పాలి. హీరోకి ధీటుగా నటించి ఔరా అనిపించాడు.సీనియర్లు సుమన్, ముక్తార్ ఖాన్ ఎక్కడా తగ్గకుండా బాగా చేశారు. పిల్లా ప్రసాద్ కూడా చక్కగా నటించాడు. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
యాక్షన్ సీన్స్
ఇంటర్వెల్ ట్విస్ట్
క్లైమాక్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
సడన్ క్లైమాక్స్
సెకండాఫ్ లో ల్యాగ్ ఉండడం
చివరిగా ఈ ‘1000 వాలా’ క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది.ఈ వీకెండ్ కి థియేటర్లలో చూడదగ్గ సినిమా. డోంట్ మిస్..!
రేటింగ్ : 3/5
Also Read:ఓటీటీలోకి ‘బ్రహ్మా ఆనందం’